ఏలూరు జిల్లాలో హోంగార్డుల కుటుంబాలకు అండగా నిలిచిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాల అంద చేసినారు
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
విధి నిర్వహణలో ఉన్న సమయంలో లేదా అనుకోని ప్రమాదాలు, అనారోగ్య కారణాల వల్ల మరణించిన హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం మానవతా దృక్పథంతో ముందుడుగు వేసింది.
ఏలూరు జిల్లా హోంగార్డ్ యూనిట్‌లో పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన హోంగార్డుల కుటుంబాలకు భరోసా కల్పించేలా వారి కుటుంబ సభ్యులలో అర్హత కలిగిన దివంగత HG-574 శ్రీ M. వీర బాబు 18.01.2026 రోడ్డు ప్రమాదం శ్రీమతి M. రామ లక్ష్మి, SSC (భార్య) - రంగంపేట పోలీస్ స్టేషన్, రాజమండ్రి దివంగత HG-28 M. శ్రీనివాసరావు 28.01.2026 అనారోగ్యం శ్రీ M. సాయి కుమార్, ఇంటర్మీడియట్ (కుమారుడు) AR లైన్స్, ఏలూరు దివంగత HG-207 శ్రీ RV. రమణ 06.04.2026 రోడ్డు ప్రమాదం శ్రీ R.D.N. అనిల్ కుమార్, SSC (కుమారుడు) దివంగత HG-168 పాండి కృష్ణ 06.04.2026 అనారోగ్యం శ్రీ P. పవన్ సాయినాథ్, B.Tech (కుమారుడు) వారికి కారుణ్య నియామక ఉత్తర్వులను జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వారు గారు ఈ రోజు అనగా 02.09.2026 వ తేదీ నాడు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో అంద చేసినారు.
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు స్వయంగా దివంగత హోంగార్డ్ కుటుంబాలలో అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబాలకు ఈ ఉద్యోగం కొంత ఆర్థిక భద్రతను, భవిష్యత్తుకు భరోసానిస్తుందని పేర్కొన్నారు.
కష్టకాలంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ఉద్యోగ కుటుంబాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రావణ్ కుమార్ ట్రైనీ ఐఏఎస్ ఆర్ ఐ సతీష్ గారు ఆర్ ఎస్ ఐ వెంకటేష్ గారు పోలీస్ ప్రధాన కార్యాలయం క్లర్క్ సయ్యద్ సునయనా గారు హోంగార్డ్స్ యూనిట్ అధికారులు, సంబంధిత సిబ్బంది మరియు నియామకపత్రాలు అందుకున్న అభ్యర్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.