కువైట్, ఖతార్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు.

కువైట్, ఖతార్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు.

09/July/2026 15:08    Share:   

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం కువైట్, ఖతార్, బహ్రెయిన్ దేశాల్లోని కీలకమైన యూఎస్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున ఆత్మహుతి (కామికేజ్) డ్రోన్లతో దాడులు నిర్వహించింది.
గల్ఫ్ రీజియన్‌లోని 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసిందనే ఆరోపణలతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించారు. ఆ వెంటనే అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ తీరప్రాంతాల్లోని దాదాపు 90 సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ అమెరికా దాడుల్లో 14 మంది ఇరానియన్లు మరణించగా, 78 మంది గాయపడ్డారు. దీనికి ప్రతిచర్యగానే తాము ఈ డ్రోన్ దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్పష్టం చేసింది అమెరికా రక్షణ శాఖ (CENTCOM) ఈ దాడులను ధృవీకరిస్తూ, ఇరాన్ ప్రయోగించిన అత్యధిక డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని, అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి
Breaking News

Subscribe our Newsletter