
అనకాపల్లి,
అనకాపల్లి రూరల్ పోలీసులు సంపతిపురం వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా, బుచ్చయ్యపేట నుండి అనకాపల్లి వైపు వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అనుమానాస్పదంగా వ్యవహరించిన ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.రూరల్ ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు చిట్టే ప్రతాప్ రెడ్డి (37), కమలాపురం, కడప ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతని వద్ద నుంచి పోలీసులు రెండు కేజీల గంజాయి, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవికుమార్ మాట్లాడుతూ, "సంపతిపురం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. స్థానిక ఎస్ఐ అనకాపల్లి, ఏఎస్ఐ భూలోక్, ఏఎస్ఐ నాయుడు, హెచ్సీ సాంబాబు, పీసీలు వెంకటరావు, నరేష్ లు కలిసి నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రెండు కేజీల గంజాయి, బైక్ ను స్వాధీనం చేసుకుని, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించాము" అని తెలిపారు.