అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
25/June/2026 07:26
Share:
అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినారు . ఈ కార్యక్రమంలో అనకాపల్లి ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత ముఖ్యం గా ఆర్టీసీ బస్ లు మరియు ఆటో లును ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయరాదు అని, శ్రీ శక్తి పధకం కారణం గా ఎక్కువ మహిలు ప్రయణిoడం జరుగుతుంది కావున, వారు ఎక్కి దిగే సమయంలో డ్రైవరు మరియు కండక్టర్ లు వారి రక్షణను భాధ్యత గా భావిచాలని తెలియజేయడమైంది. అతివేగం వల్ల కలిగే ప్రమాదాలు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించరాదని, ట్రాఫిక్ సంకేతాలను తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు. చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా చైతన్యపరిచే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులపై మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార పోస్టర్లు అతికించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి, కుటుంబం మరియు సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు మరియు ప్రయాణికులు ఉత్సాహంగా పాల్గొని ట్రాఫిక్ నియమాలు పాటించడం మరియు మాదకద్రవ్యాల నిర్మూలనకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.