వికెపీసీపీఐఆర్ 2051, మాస్టర్ 2041 బృహత్తర ప్రణాళిక

వికెపీసీపీఐఆర్ 2051, మాస్టర్ 2041 బృహత్తర ప్రణాళిక

21/February/2026 17:12    Share:   

వికెపీసీపీఐఆర్ 2051, మాస్టర్ 2041 
బృహత్తర ప్రణాళికల తయారీ పై  ఒక్కరోజు కార్యశాల ( వర్క్ షాప్ ) కార్యక్రమంలో మాట్లాడుతున్న వి.ఎం.ఆర్డి.ఎ. కమిషనర్, వికెపీసీపీఐఆర్ వైస్ చైర్మన్ తేజ్ భరత్
అనకాపల్లి, ఫిబ్రవరి 21 : విశాఖపట్నం - కాకినాడ పెట్రో కెమికల్ పెట్రోలియం పెట్టుబడి ప్రాంతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (వీకేపీసీపీఐఆర్) 2051 మరియు మాస్టర్ 2041 బృహత్తర ప్రణాళికల తయారీ పై  స్టేక్ హోల్డర్ర్లు  అధికారులు సలహాలు సూచనలు తెలిపాలని .ఎం.ఆర్డి.ఎ. కమిషనర్, వికెపీసీపీఐఆర్ వైస్ చైర్మన్ తేజ్ భరత్  పేర్కొన్నారు. శనివారం అనకాపల్లి పట్టణం స్థానిక సన్ కేస్టల్ హోటల్ లో వీకేపీసీపీఐఆర్ 2051 మరియు మాస్టర్ 2041 బృహత్తర ప్రణాళికల తయారీ పై ఒక్కరోజు కార్యశాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వి.ఎం.ఆర్డి.ఎ. కమిషనర్, వికెపీసీపీఐఆర్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ కొరకు స్టేక్ హోల్డర్ల తో సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుని ఆగష్టు నాటికీ నివేదికను సిద్ధం చేయాలని వి.ఎం.ఆర్డి.ఎ. కమిషనర్, వికెపీసీపీఐఆర్ వైస్ చైర్మన్ తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. వీకేపీసీపీఐఆర్ అనకాపల్లి కాకినాడ, విశాఖపట్నం జిల్లాలోని 10 మండలాల్లో 97 గ్రామాలను కవర్ చేస్తుందన్నారు. వికెపీసీపీఐఆర్ 640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందన్నారు. ఈ  బృహత్తర ప్రణాళికలో ముఖ్యమైన సమస్యలు పరిశ్రమలు, రోడ్లు, రేవులను కలుపుతూ అభివృద్ధి చర్యల కోసం కావాల్సిన సమాచారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాలు, నీటి వనరులు, ప్రభుత్వ భూమి వివరాలు, పారిశ్రామిక వృద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యావరణ రక్షణలు, గృహ నిర్మాణం మరియు సామాజిక మౌలిక సదుపాయాలతో  పారిశ్రామిక సంస్థలను అనుసంధానం చేస్తూ బృహత్తర ప్రణాళిక సిద్ధం చెయ్యడానికి లీ అసోసియేట్ సౌత్ ఏసియన్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఇచ్చి ఈ  బృహత్తర ప్రణాళికలో పొందుపరి చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు వ్యూహాత్మకంగా స్థాపించబడిన పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటిగా వి కె పి సి పి ఐ ఆర్ నిలుస్తుందన్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థలు, స్థానిక ప్రతినిధులు మరియు సాంకేతిక నిపుణుల నుండి వచ్చే సలహాలు సూచనలు వికెపీసీపీఐఆర్ 2051, మాస్టర్ 2041 బృహత్తర ప్రణాళికల పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
ఎమ్మెల్యే  కోణతాల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే నీతి ఆయోగ్ 2025 డిసెంబర్ లో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ నివేదికను విడుదల చేసిందన్నారు. ఇది ఉత్తర మరియు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్‌ లోని తొమ్మిది జిల్లాలను కవర్ చేస్తుందన్నారు, శ్రీకాకుళం నుండి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వరకు, వేగంగా అభివృద్ధి చెందుతున్నరు. వాటిలో, విశాఖపట్నం, అనకాపల్లి మరియు కాకినాడ జిల్లాలు అధికంగా ప్రయివేటు సంస్థ ల పెట్టుబడులు, ఎం ఓ యు జరగయన్నారు, ఉపాధి కల్పనకు ఉత్ప్రేరక చోదకాలుగా పనిచేసే నక్కపల్లిలోని పరిశ్రమలు (బల్క్ డ్రగ్ పార్క్, ఎ ఎం ఎన్ ఎస్, టాయ్ పార్క్  వచ్చాయన్నారు. అదనంగా వికెపిసిపిఐ ఆర్ ప్రాంతంలో వస్తున్న కాకినాడ గేట్‌వే పోర్ట్ మరియు నక్కపల్లి యాంకర్ పోర్ట్ వంటి కొత్త ఓడరేవులు సముద్ర సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయన్నారు, ఎగుమతి సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయన్నారు మరియు ప్రపంచ వాణిజ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తాయన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో స్టేక్ హోల్డర్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యా మాన్ పటేల్, వికెపీసీపీఐఆర్ జాయింట్ డైరెక్టర్ వి శిల్ప, కాకినాడ జిల్లా జడ్పీ సీఈఓ లక్ష్మణ్, లీ అసోసియేట్ ప్రయివేట్ కంపెనీ ప్రతినిధులు,  జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రామారావు, స్టేక్ హోల్డర్స్,  వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter