యలమంచిలి ప్రజల సహకారంతో రాంనగర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు..!
09/April/2026 20:22
Share:
క్రైమ్ అనాలిసిస్ – టీవీఎస్ ప్రకాష్, యలమంచిలి యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు రాంనగర్‌లో ఇటీవలి కాలంలో దొంగతనాల భయం పెరుగుతున్నది. ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లినప్పుడు దొంగలు చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పోలీస్ విభాగం పగడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నప్పటికీ, దొంగలు తప్పించుకుంటుండటం పోలీసులకు సవాలుగా మారింది.ఈ ప్రాంతం ఒక వైపు రైల్వే స్టేషన్, మరో వైపు నేషనల్ హైవే ఉండటం వల్ల దొంగలు సులభంగా పారిపోవడానికి అవకాశం ఉందని యలమంచిలి పట్టణ ఎస్సై కే. సావిత్రి తెలిపారు.ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు కొటారు శ్రీనివాస మాస్టర్, లంక ఉదయ్ రాంనగర్ ప్రజలతో సమావేశమై, ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సహకరిస్తూ, ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే రాంనగర్‌కు చెందిన శ్రీమంతుల శ్రీను తన వీధిలో నివసించే వారితో మాట్లాడి మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఉదాహరణగా నిలిచారు.ప్రజలందరూ ఇలాగే ముందుకు వచ్చి సహకరిస్తే రాంనగర్‌లో భద్రత మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.