చిల్డ్రన్ హోమ్స్ సంక్షేమంపై పర్యవేక్షణ  జిల్లా జాయింట్ కలెక్టర్ డా.అభిషేక్ గౌడ

చిల్డ్రన్ హోమ్స్ సంక్షేమంపై పర్యవేక్షణ జిల్లా జాయింట్ కలెక్టర్ డా.అభిషేక్ గౌడ

08/May/2026 20:31    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
స్వచ్ఛంద సంస్థల వసతి గృహాలలో  ఆశ్రయం పొందుతున్న బాలబాలికల సంక్షేమాన్ని పర్యవేక్షించాలని   జిల్లా జాయింట్ కలెక్టర్ డా.అభిషేక్ గౌడ  అధికారులను ఆదేశించారు.  స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం జిల్లా స్థాయి  చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్పెక్షన్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ   జిల్లాలో ఇప్పటివరకు లైసెన్స్ పొందిన 23 చిల్డ్రన్ హోమ్ లను అధికారులు ప్రతీ నెలా సందర్శించి వారి యోగక్షేమాలను, ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలన్నారు.  జిల్లాలో ఇంకా రిజిస్టర్ కాకుండా విద్యా సంస్థలతో అనుసంధానమై ఉన్న చిల్డ్రన్ హోమ్ లను వాటిని కూడా పరిశీలించి రిజిస్టర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిఈఓ ను జేసీ ఆదేశించారు. చిల్డ్రన్ హోమ్స్, 
హాస్టల్స్ ను  హాస్టల్స్ నియమ నిబంధనల ప్రకారము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అనుమతి పొంది నిర్దిష్టమైన ప్రమాణాలను పాటిస్తూ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని డి ఇ ఓ కు సూచించారు. .  గా ఇప్పటివరకు ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ సందర్శించిన సమయంలో గుర్తించిన హోమ్ ల యొక్క పరిస్థితుల్ని వెంటనే వాటిని మార్పు చేసుకోవాలని అక్కడ ఆశ్రయం పొందుతున్న బాలలకు మరింత మంచి సౌకర్యాలు అందించాలని వారికి నెలవారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అదేవిధంగా వారి యొక్క మానసిక అభివృద్ధిని  సైకియాట్రిస్ట్ విభాగం నుంచి ఉన్న కౌన్సిలర్స్ ద్వారా ఒక ప్రస్నావళి  రూపొందించి దానిద్వారా పిల్లల్లో మానసిక పరిపక్వతను గమనించాలని, ఏదైనా మానసిక రుగ్మత, ఆందోళనలకు గురయ్యే లక్షణాలను గమనిస్తే వెంటనే వాటిని కౌన్సింగ్,  చికిత్స ద్వారా నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  
ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ డీసీపీవో  సిహెచ్ సూర్య చక్రవేణి , డీఈవో  వెంకట లక్ష్మమ్మ  ఐసిడిఎస్ పిడి  పి శారద , సిబ్బంది  కుమారి జ్యోతి, ,జిసిడిఓ నవీన,  జిల్లా స్థాయి కమిటీ సభ్యులు ఐకే రాజు -   రవితేజ చిల్డ్రన్ హోమ్, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ వి సాహిత్య, సైకియాట్రిస్ట్ విభాగం నుంచి డాక్టర్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter