పూడిమడక భూ నిర్వాసితుల వినతిపత్రం – కలెక్టర్ వద్ద డిమాండ్
అనకాపల్లి, ఆగస్టు 10:
NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు కోసం జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోయిన పూడిమడక గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు.
రైతులు తమ వినతిపత్రంలో, భూ సేకరణ సమయంలో ప్రభుత్వం మరియు అధికారులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రజా ప్రయోజనాల చట్టం 2013ను వర్తింపజేసి ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే R-కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు.
రైతు నాయకులు చోడిపల్లి అప్పారావు, ఉమ్మిడి అప్పారావు మాట్లాడుతూ, “భూములు ఇచ్చినట్టు నిర్వాసిత రైతుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్మాణ పనులు చేపడితే, తదనంతరం జరిగే పరిణామాలకు ప్రభుత్వం మరియు APiiC అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.
కలెక్టర్ గారు న్యాయం చేయని పక్షంలో, రైతులు ఐక్యంగా NTPC గేట్ ముందు ఆందోళనలు, వంటావార్పు వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.