ఆదర్శప్రాయుడు అల్లూరి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. 

ఆదర్శప్రాయుడు అల్లూరి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. 

08/May/2026 06:34    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు 

భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) మరియు అఖిల భారత యువజన సమాఖ్య (ఎ.ఐ.వై.ఎఫ్.) ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి కార్యక్రమం ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు జరిగినది.
జోహార్ అల్లూరి సీతారామరాజు  సాధిస్తాం అల్లూరి సీతారామరాజు ఆశయాలను అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు పట్టణ సిపిఐ మాజీ కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారత భూమిని దోపిడీ నుంచి అంధకారం నుంచి వలసవాద పాలన నుంచి విముక్తి కోసం విరోచితంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అక్షరం ముక్క తెలియని గిరిజనులని దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేలా చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ఆయన చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని నేడు పాలిస్తున్న సంఘ్ పరివార శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో కొత్త ఉత్తేజాన్ని,ఉత్సాహాన్ని నింపిన విరోచిత స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా ఎంచి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని కొనియాడారు.ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలకులపై ఉద్యమాలు నిర్వహించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ,గొర్లి స్వాతి,తమ్మిశెట్టి రమణయ్య,బళ్ల కనక దుర్గారావు,బుగ్గల ప్రభాకర్, 
ఏం. ఏ.హకీమ్ తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter