పది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాదించాలి జనసేన పార్టీ రాంబిల్లి మండలశాఖ అధ్యక్షుడు

పది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాదించాలి జనసేన పార్టీ రాంబిల్లి మండలశాఖ అధ్యక్షుడు

14/March/2026 21:06    Share:   

రెండు పాఠశాలలో పది విద్యార్థులకు పరిక్షా సామాగ్రి అందజేత
- పది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాదించాలి జనసేన పార్టీ రాంబిల్లి మండలశాఖ అధ్యక్షుడు పప్పల నూకన్నదొర
యలమంచిలి:పది పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు క్రమశిక్షణతో చదువి ఉత్తమ ఫలితాలు సాధించాలని జనసేన పార్టీ రాంబిల్లి మండలశాఖ అధ్యక్షుడు పప్పల నూకన్నదొర అన్నారు. జనసేన పార్టీ రాంబిల్లి మండల ప్రచార కార్యదర్శి ఎరిపల్లి నాగరాజు (గబ్బర్సింగ్) తన సొంత నిధులు వెచ్చించి రాంబిల్లి కేజీబీవీ పాఠశాల, కొత్తపట్నం హైస్కూల్లో పది పబ్లిక్ పరీక్షలు రాసే సుమారు 60 మంది విద్యార్థులకు శనివారం పరీక్షా సామాగ్రీని అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నూకన్నదొర మాట్లాడుతూ విద్యార్థులు తల్లి, దండ్రుల సహకారంతో లక్ష్యాలను నిర్దేశించుకుని పరీక్షలు పట్ల భయాన్ని వీడి రోజూ పునశ్చరణ చేసుకోవడం ద్వారా 100 శాతం ఉత్తీర్ణత, అత్యున్నత మార్కులు సాధించవచ్చునన్నారు. సమయానికి ఆహారం తీసుకుంటూ, తగినంత నిద్రపోతూ, మానశిక ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతం గా చదవాలని సూచించారు. జనసేన పార్టీ రాంబిల్లి మండల ప్రచార కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో పది పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్ర తిఏట తనకు ఉన్నతంలో సహాయ సహాకారాలు అందిస్తున్నానన్నారు. తనకు అవకాశం ఉన్నంతవరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాంబిల్లి మండల వైఎస్ ఎంపీపీ కశిరెడ్డి నర్శింగరావు, కూటమి నేతలు కారే నాని, సన్యాసిరావు, గణేష్, పలువరు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter