ఆల్ ఇండియా సైనిక్ ప్రవేశ పరీక్ష నందు మొదటి స్థానంలో సాధించిన విద్యార్థినీ విద్యార్థులు

ఆల్ ఇండియా సైనిక్ ప్రవేశ పరీక్ష నందు మొదటి స్థానంలో సాధించిన విద్యార్థినీ విద్యార్థులు

22/March/2026 17:48    Share:   

ఆల్ ఇండియా సైనిక్ ప్రవేశ పరీక్ష నందు మొదటి స్థానంలో సాధించిన విద్యార్థినీ విద్యార్థులు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బి.వి. సత్యవతి గారిని వారి క్యాంప్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా ఈ రోజు అనగా తే ది 21-3-2026 కలవడం జరిగినది .ఆల్ ఇండియా సైనిక్ ప్రవేశ పరీక్ష నందు స్టేట్ ఫస్ట్ మొదటి స్థానం  సాధించిన  వై కుషాల్,బాలికల విభాగం నుండి స్టేట్ సైనిక్ ప్రవేశ పరీక్ష నందు మొదటి స్థానం సాధించిన ప్రవస్తి మరియు జిల్లాస్థాయి నవోదయ ప్రవేశ పరీక్ష నందు  మొదటి స్థానం సాధించిన మల్ల ధనుంజయ్, ఆల్ ఇండియా రాష్ట్రీయ మిలిటరీ ప్రవేశ పరీక్ష నందు సాధించిన హేమవర్ధన్, జి సుశాంక్.
ఈ సందర్భంగా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు విద్యార్థిని విద్యార్థులను అభినందించి వారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నట్టు  తెలిపారు.అదే విధంగా ఈ హెచ్వీఎంసీని అకాడమీ వారిని అభినందించి  మరి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది మన జిల్లాకి అందించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కరస్పాండెంట్ సాయిబాబా గారు, ఉపాధ్యాయులు బి.ఎన్ రాజుగారు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter