విద్యార్థుల ప్రతిభను బట్టే మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు
03/March/2026 16:16
Share:
అనకాపల్లి పట్టణం గాంధీనగరంలో గల బిసి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బ్రైడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ఎటువంటి విద్యను అభ్యసించాలో అనే అంశంపై ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో సమస్త అధ్యక్షులు కాళ్ళ శివశంకర్ మరియు కార్యదర్శి తాతపూడి జయశ్రీ మాట్లాడుతూ విద్యార్థి దశలో బాగా చదవాలని వాళ్ళకి అవసరమైన రంగంలో రాణించడానికి మధ్య విద్యను అభ్యసించడంతోపాటు వారి యొక్క నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకోవాలని వారు పిలుపునిచ్చారు అంతేకాకుండా ఈ వసతి గృహాల్లో చదివే విద్యార్థులు చాలామంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాబట్టి వారికి ఏం చదివితే ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయో తెలియదు కాబట్టి ఇప్పటినుండే సరియైన ప్రణాళిక వేసుకొని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల పెద్దల సలహాలు సూచనలు తీసుకొని వారి యొక్క కెరియర్ను ఒక ప్రణాళిక బద్దంగా తయారు చేసుకోవాలని వారు తెలిపారు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మరికొన్ని రోజుల్లో పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు కాబట్టి 10వ తరగతి పూర్తయిన తర్వాత ఏ కోర్సులు చదివితే ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయో అనే అంశంపై అవగాహన కల్పించే నిమిత్తం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పదో తరగతి పూర్తయ్యాక ఉన్న కోర్సులు ఉద్యోగ ఉపాధి అవకాశాలను గురించి వారికి క్షుణ్ణంగా వివరించి వారి యొక్క సందేహాలను నివృత్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు బి బి బి ప్రసాద్ సిహెచ్ ప్రదీప్ కుమార్ పివి కిరణ్మయి కేఎస్ జ్యోతి కుమారి మరియు హాస్టల్ నిర్వాహకులు సత్యనారాయణ శ్రీనివాస్ సత్యానందం స్థానిక ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది