ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మే.1న రాష్ట్రస్థాయి గ్రూప్ 2 మెగా పోటీ పరీక్ష
29/April/2026 20:45
Share:
యలమంచిలి స్థానిక గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మే 1, 2026న రాష్ట్రస్థాయి గ్రూప్-2 మెగా పోటీ పరీక్షను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ జువాలజీ లెక్చరర్ డాక్టర్ ఏ.అర్జున అప్పారావు, సీనియర్ భౌతిక శాస్త్ర అధ్యాపకులు కె. వెంకన్నల ఆధ్వర్యంలో కాంపిటేటివ్ పరీక్ష నిష్ణాతులచే ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.ఈ పోటీ పరీక్షను ఆన్‌లైన్ మరియు భౌతికంగా (ఆఫ్‌లైన్) కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. భౌతికంగా జరిగే పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి బహుమతిగా ₹3,000, రెండో బహుమతిగా ₹2,000 మరియు మూడో బహుమతిగా ₹1,000 అందజేయడంతో పాటు,కన్సోలేషన్ బహుమతులు కూడా ఉంటాయని తెలిపారు.అదేవిధంగా, ఆన్‌లైన్ పరీక్షలో పాల్గొన్న మొదటి వందమంది విజేతలకు పుస్తక బహుమతులతో పాటు, వేల రూపాయల విలువైన పోటీ పరీక్షల ఆన్‌లైన్ యాప్ రిజిస్ట్రేషన్‌ను ఉచితంగా కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.