ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా  గ్రెగర్ జోహన్ మెండల్ జన్మదిన వేడుకలు

ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా గ్రెగర్ జోహన్ మెండల్ జన్మదిన వేడుకలు

22/July/2026 19:44    Share:   

ఎలమంచిలి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జన్యు శాస్త్ర పితామహుడు గ్రెగర్ జోహన్ మెండల్ జన్మదిన వేడుకలను జువాలజీ విభాగం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. చంద్రశేఖర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆధునిక జీవశాస్త్ర విప్లవానికి మెండల్ చేసిన పరిశోధనలే పునాది అని ఆయన కొనియాడారు. ఆయన ప్రతిపాదించిన జన్యు సూత్రాలు శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఎలా మలుపు తిప్పాయో విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థులు శాస్త్రవేత్తల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని పరిశోధనల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) సీనియర్ లెక్చరర్, హెడ్ ఆఫ్ సెంటర్ ఫర్ అప్లైడ్ సైన్సెస్ డాక్టర్ ఎం. ప్రదీప్ ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యారు. ఆయన "మెండెల్ జన్యు శాస్త్రం నుండి అణు జన్యు శాస్త్ర పరివర్తన" అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జన్యు శాస్త్రంలో వస్తున్న మార్పులను, సరికొత్త సాంకేతికతలను ఆయన వివరించారు.అనంతరం ఈ వేడుకల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన సైన్స్ క్విజ్ పోటీల విజేతలకు కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె. సుజాత, ఐక్యూఏసీ (IQAC) కోఆర్డినేటర్ డాక్టర్ కె. వెంకన్న, వృక్ష శాస్త్ర అధ్యాపకులు కె. రాజేశ్వరి, పద్మజ, ఇతర కళాశాల అధ్యాపక సిబ్బంది మరియు  విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..
Breaking News

Subscribe our Newsletter