“మొవేట్ టెక్నాలజీస్” మల్టీ నేషనల్ కంపెనీ లో డైట్ విద్యార్థుల నియామకాలు
05/February/2026 17:28
Share:
దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్), అటానమస్ కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేసేలా నిరంతర ప్లేస్మెంట్ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రముఖ మల్టీ నేషనల్ సంస్థ “మొవేట్ టెక్నాలజీస్ “ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేస్మెంట్ (డైవ్ విజయవంతంగా పూర్తయ్యింది. ఈ (డైవ్ లో ముందుగా కమ్యూనికేషన్ అసెస్మెంట్ నిర్వహించి, అనంతరం సాంకేతిక నైపుణ్యాలపై వన్-ఆన్-వన్ వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ప్రక్రియలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ వర్క్ లొకేషన్తో పాటు సంవత్సరానికి రూ. 3.5 లక్షల సీటీసీ (అన్ని ప్రయోజనాలతో సహా) అందించనున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆర్. వైకుంఠరావు మాట్లాడుతూ, డైట్ లో అమలవుతున్న కెరీర్ రెడీనెస్ ప్రోగ్రామ్ అత్యంత ప్రభావవంతంగా ఉందని, ఈ ప్లేస్మెంట్ ఫలితాలు ఆ శిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులందరినీ ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. అదేవిధంగా, కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ గారు ప్లేసెమెంట్ సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఐటీ మరియు కోర్ బ్రాంచ్ల విద్యార్థుల కోసం ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలతో మరిన్ని ప్లేస్మెంట్ డ్రైవ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టి సి ఎస్), డెలోయిట్, హుబెల్ బెల్లౌస్, సబ్స్ట్రేట్, ఇన్ఫ్రా.మార్కెట్ వంటి సంస్థలతో ప్లేస్మెంట్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గర్వంగా వెల్లడించారు. డైట్లో విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని, భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కళాశాల ముందుకు సాగుతుందని టి పి ఓ హేమంత్ కుమార్ స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ విభాగాధిపతులు, డిపార్ట్మెంట్ ప్లేసెమెంట్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.