డైట్లో ఎంబీఏ విద్యార్థుల కోసం సాఫ్ట్ స్కిల్స్ మరియు ప్లేస్మెంట్

డైట్లో ఎంబీఏ విద్యార్థుల కోసం సాఫ్ట్ స్కిల్స్ మరియు ప్లేస్మెంట్

21/February/2026 17:16    Share:   

దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ-అటానమస్  మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎంబీఏ విద్యార్థుల కు ఆరు రోజులు అనగా 16-02-2026 నుండి 21-02-2026 వ్యక్తిత్వ వికాసం మరియు ఉద్యోగ అవకాశాల మెరుగుదలకు తోడ్పడే లక్ష్యంతో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో, మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ సహకారంతో సాఫ్ట్ స్కిల్స్ మరియు ప్లేస్మెంట్ ట్రైనింగ్ వర్క్షాప్ను  నిర్వహించనున్నట్లు ఎంబి విభాగాధిపతి డాక్టర్ పి. బి రామకుమార్ తెలిపారు.
మొదటిరోజు: సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ మరియు ప్రతి విద్యార్థి యొక్క బలము, బలహీనతలు, టాలెంట్ అడిగి తెలుసుకున్నారు. రెండవ రోజు కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ టెక్నిక్స్, రెజ్యూమ్  తయారీ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు గురించి తెలియజేశారు .మూడవరోజు ఉద్యోగ అవకాశాలపై, మరియు ఎంబీఏ లో ప్రధానమైన కేసు స్టడీస్, టీం వర్క్ మరియు ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నాలుగవ రోజున ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ పై ఎంబీఏ విద్యార్థులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐదవ రోజున డెసిషన్ మేకింగ్, ఈ పోటీ ప్రపంచంలో ఎంబీఏ విద్యార్థుల రెజ్యూమ్ ఏ విధంగా ఉండాలో స్ట్రక్చర్ తెలియజేశారు.  చివరి రోజు అనగా ఆరవ రోజు మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అశోక్ కుమార్ & వంశి ఎంబీఏ విద్యార్థులకు మాక్ ఇంటర్వ్యూస్ పెట్టి విద్యార్థుల యొక్క స్కిల్స్ మరియు స్ట్రన్స్ నీ పరీక్షించారు. ఉద్యోగ అవకాశాల గురించి వివరిస్తూ కమ్యూనికేషన్ మరియు నైపుణ్యతను ఎలా పెంపొందించుకోవాలో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుంది చెప్పారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ వైకుంఠ రావు గారు మాట్లాడుతూ, ఈ వర్క్షాప్ విద్యార్థుల భవిష్యత్తు కెరీర్కు ఎంతో ఉపయోగపడుతుందని, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తాయని తెలిపారు.ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ పి బి రామ్ కుమార్ మాట్లాడుతూ, మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ నిపుణులు విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్ భవిష్యత్తులో విద్యార్థులకు ఈ స్కిల్స్  ఉద్యోగ అవకాశాలకు ఎంతో ఉపయోగపడుతుందని దీని ద్వారా విద్యార్థులు వివిధ బ్యాంకింగ్ రంగంలో  ఉద్యోగాలు పొందారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ విద్యార్థులు, అధ్యాపకులు మరియు శిక్షణ నిపుణులు పాల్గొననున్నారు.
Breaking News

Subscribe our Newsletter