యువతలో ప్రతిభను గుర్తించుట కొరకు శాప్ లీగ్ సెలక్షన్ నిర్వహణ
16/February/2026 20:43
Share:
జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అనకాపల్లి (కలెక్టరేట్ ) ఫిబ్రవరి16 : జిల్లాలో క్రీడలను ప్రోత్సహించి, మంచి క్రీడాకారులను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ క్రీడా అబివృద్ధి అధికారిని ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి జిల్లా క్రీడా అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించే శాప్ లీగ్ పోటీలలో ఎక్కువ క్రీడాకారులు పాల్గొనేలా చూడాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీమతి పూజారి శైలజ గారిని ఆదేశించటం జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారిచే నిర్వహించే క్రీడా గోడ పత్రికలను ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా క్రీడాల అభివృద్ధి అధికారి పూజారి శైలజ, జెడ్పి సిఇఒ నారాయణ మూర్తి, డి పి ఒ. సందీప్, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి మంజుల వాణి, డ్వామా పీడీ పూర్ణిమా దేవి, యలమంచిలి, అనకాపల్లి, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ నరసింహ, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.