యలమంచిలి శ్రీ గురజాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీపీఎస్సీ గ్రూప్-2

యలమంచిలి శ్రీ గురజాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 'మెగా మాక్ టెస్ట్–2026'

13/April/2026 13:37    Share:   

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 రాష్ట్ర స్థాయి మెగా పరీక్ష
క్రైమ్ అనాలసిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి :
యలమంచిలి పట్టణంలోని శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెగా పరీక్ష–2026ను నిర్వహించనున్నట్లు కళాశాల నిర్వాహకులు వెల్లడించారు.డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మెగా పరీక్షను మే 1, 2026న (బుద్ధ పౌర్ణమి సందర్భంగా) నిర్వహించనున్నారు.ఈ పరీక్ష రాష్ట్ర స్థాయి పోటీని ప్రతిబింబించే విధంగా రూపొందించబడింది. మొత్తం 100 ప్రశ్నలతో పరీక్ష నిర్వహించబడుతుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించగా, తప్పు సమాధానాలకు 1/3 నెగటివ్ మార్కింగ్ అమలు చేస్తారు. పరీక్ష విధానం ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ నమూనాలో ఉంటుంది.ఈ మెగా టెస్ట్‌ను రెండు విధానాల్లో నిర్వహించనున్నారు.
ఆఫ్‌లైన్ పరీక్షను కళాశాల ప్రాంగణంలో నిర్వహించగా, ఆన్‌లైన్ పరీక్షను “గండీవం యాప్” మరియు గాండీవం వెబ్‌సైట్ ద్వారా నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్ పరీక్షకు కేవలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా, 500 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముందుగా నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.ఆఫ్‌లైన్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు నగదు బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ.3000, రెండవ బహుమతి రూ.2000, మూడవ బహుమతి రూ.1000గా నిర్ణయించారు. ఆన్‌లైన్ పరీక్షలో మొదటి 100 మందికి గండీవం యాప్ ద్వారా ఉచిత కోర్సు అందించబడుతుంది.
ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులు తమ సన్నద్ధత స్థాయిని అంచనా వేసుకుని, రాష్ట్ర స్థాయి పోటీలో తమ స్థానాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది అభ్యర్థులు పాల్గొనే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు.పరీక్షకు సంబంధించిన నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఆసక్తి గల అభ్యర్థులు త్వరగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫలితాలు మరియు విశ్లేషణ గండీవం యాప్ మరియు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.మే 5, 2026న కళాశాలలో బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు కెరీర్ గైడెన్స్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter