డైట్ (DIET) ఇంజినీరింగ్ కళాశాలకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు,
16/May/2026 14:16
Share:
జెఎన్‌టియూ-గురజాడ (JNTU-GV) నుండి డైట్ సంస్థకు కీలక అనుమతులు.. దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (DIET) అనకాపల్లిలోని దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (DIET) కు చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) విభాగాలకు Jawaharlal Nehru Technological University-Gurajada Vizianagaram నుండి రీసెర్చ్ సెంటర్ అనుమతుల పొడిగింపు లభించడం సంస్థకు గర్వకారణమని DIET యాజమాన్యం తెలియజేసింది. ఈ రీసెర్చ్ సెంటర్ అనుమతులు 2028 సంవత్సరం వరకు చెల్లుబాటు కానున్నాయి. జెఎన్‌టియూజీవీ గౌరవ ఉపకులపతి Prof. V. V. Subba Rao గారు, DIET గౌరవ చైర్మన్ Sri Dadi Ratnakar గారి సమక్షంలో, 15-05-2026 న విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ రీసెర్చ్ సెంటర్ పొడిగింపు ధ్రువపత్రాలను ECE విభాగాధిపతి Dr. P. Poorna Priya గారికి మరియు CSE విభాగాధిపతి Dr. K. Sujatha గారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి జెఎన్‌టియూజీవీ ఆర్ & డీ డైరెక్టర్ Dr. G. Swami Naidu గారు కూడా హాజరై DIET ప్రతినిధి బృందాన్ని అనుసరించారు. జెఎన్‌టియూజీవీ నుండి రీసెర్చ్ సెంటర్ అనుమతుల పొడిగింపు లభించడం DIET సంస్థ విద్యా ప్రామాణికత, పరిశోధనా నైపుణ్యం, సాంకేతిక ఆవిష్కరణలు మరియు ఉన్నత విద్యా అభివృద్ధికి చేస్తున్న కృషికి నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ గుర్తింపు ద్వారా CSE మరియు ECE విభాగాలలో అధునాతన పరిశోధనలు, పీహెచ్‌డీ కార్యక్రమాలు, పరిశోధన ప్రాజెక్టులు మరియు పరిశ్రమలతో సంయుక్త పరిశోధన కార్యక్రమాలు మరింత బలోపేతం కానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా DIET చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ గారు ఆనందం వ్యక్తం చేస్తూ,రెండు విభాగాల అధ్యాపక బృందాలను అభినందించారు.సంస్థలో పరిశోధనలకు ప్రోత్సాహం కల్పిస్తూ,సాంకేతిక ఆవిష్కరణలు మరియు నూతన ఆలోచనలకు వేదికగా DIET ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. జెఎన్‌టియూజీవీ ఉపకులపతి ప్రొఫెసర్ వి.వి. సుబ్బారావు గారు DIET సంస్థ సాంకేతిక విద్య మరియు పరిశోధన రంగాలలో చేస్తున్నసేవలను ప్రశంసిస్తూ,అధ్యాపకులు మరియు పరిశోధకులు సమాజ అవసరాలకు అనుగుణమైన పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా DIET యాజమాన్యం,ప్రిన్సిపాల్,అధ్యాపకులు,సిబ్బంది మరియు విద్యార్థులు జెఎన్‌టియూజీవీకి కృతజ్ఞతలు తెలిపారు.