డైట్‌లో ఎన్సీటీసీటీ–2కే26 జాతీయ సదస్సు ముగింపు..

డైట్‌లో ఎన్సీటీసీటీ–2కే26 జాతీయ సదస్సు ముగింపు..

10/March/2026 19:21    Share:   

డైట్‌లో ఎన్సీటీసీటీ–2కే26 జాతీయ సదస్సు ముగింపు – ఐఎస్‌బీఎన్‌తో ప్రొసీడింగ్స్ విడుదల
10-03-2026
దాడి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ - Autonomous. ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రొఫెషనల్ బాడీ ఆధ్వర్యంలో  నిర్వహించిన “కంప్యూటింగ్ టెక్నాలజీ ధోరణులపై జాతీయ సదస్సు – ఎన్సీటీసీటీ-2కే26” వాలెడిక్టరీ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్ విభాగాధిపతి డాక్టర్ రామరాజు పూసపాటి గారు మరియు డెల్టా మార్చ్ టెక్నాలజీస్ సంస్థలో చీఫ్ స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శ్రీ చంద్ర ఎస్ దసక గారు హాజరయ్యారు. వారు కంప్యూటింగ్ రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలు, నూతన సాంకేతికతల గురించి విద్యార్థులకు వివరించారు.
సమకాలీన కంప్యూటింగ్ సాంకేతికతలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అంశాలపై పరిశోధన పత్రాలను ఈ సదస్సులో ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్న 30 ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్స్ నుండి వచ్చిన 160 పేపర్స్ పరిశోధకులు తమ పరిశోధనలను పంచుకొని చర్చలు జరిపారు.
అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించుకుని సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు పరిశోధన, ఆవిష్కరణలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సృజనాత్మకంగా వినియోగించి పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా రూపొందించిన సదస్సు ప్రొసీడింగ్స్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రంథానికి ISBN: 978-93-5773-574-2 కేటాయించబడింది.
ఇటువంటి జాతీయ సదస్సులు విద్యార్థులలో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడమే కాకుండా అకాడమిక్ రంగం మరియు పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమానిలో శ్రీ దాడి రత్నాకర్ గారు, ఛైర్మన్, డైట్,కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. వైకుంఠ రావు గారు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
సదస్సు కన్వీనర్ డాక్టర్ కె. సుజాత గారు కార్యక్రమాన్ని సమన్వయం చేయగా, ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter