క్వాంటం కంప్యూటింగ్ తో ఉద్యోగ భరోసా

క్వాంటం కంప్యూటింగ్ తో ఉద్యోగ భరోసా

16/February/2026 19:24    Share:   

భవిష్యత్తు అంతా క్వాంటం కంప్యూటింగ్ తో ఉద్యోగ భరోసా   
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ తో ఏపీ.ఎస్.ఎస్.డీసి ఆధ్వర్యంలో దాడి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ,  అటనామస్ లో  సి ఎస్ ఈ డిపార్ట్మెంట్ నిర్వహించిన వారంరోజుల  పాటు జరిగిన  “క్వాంటమ్ కంప్యూటింగ్  వర్క్షాప్” ప్రశాంతంగా ముగిసింది. 
మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి లో  క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తూ వేల సంఖ్య లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. వీటి నిమిత్తం అన్ని కలశాలలకు క్వాంటం కంప్యూటింగ్ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ శ్రీ డేనియల్ ఫ్రాన్స్వా, సీనియర్ అకౌంట్స్ మేనేజర్ ,డెల్ టెక్నాలజీస్ ,హైదరాబాద్. క్లాసికల్ కంప్యూటింగ్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ మధ్య తేడాలు, క్యూబిట్స్ అవగాహన, బ్లోచ్ స్ఫియర్, సింగిల్ మరియు మల్టీ క్యూబిట్ గేట్స్ వంటి ముఖ్యమైన అంశాలను వివరించారు.
ఈ  వర్కుషాప్ ద్వారా విద్యార్థులు క్వాంటమ్ సూత్రాలు మరియు గేట్స్ పై ప్రాథమిక మరియు ఆధునిక పరిజ్ఞానం పొందారని సి.ఎస్.ఇ విభాగాధిపతి డాక్టర్. కె. సుజాత గారు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఆర్. వైకుంఠ రావు గారు మాట్లాడుతూ ఇలాంటి వర్కుషాప్లు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
కళాశాల చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ గారు వర్కుషాప్ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులను అభినందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో విద్యార్థులు ముందంజలో ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని తెలిపారు.
విద్యార్థులు ఈ వర్కుషాప్ ద్వారా కొత్త సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకున్నామని పేర్కొన్నారు. కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు మరియు కళాశాల యాజమాన్యానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter