కొత్తపేట జెడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం...

కొత్తపేట జెడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం...

15/May/2026 21:05    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - ఉత్త్రాంద్ర జోనల్ ఇంచార్జ్ :
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తపేట యలమంచిలి ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కొక్కిరాపల్లి, షేకిల్‌పాలెం, ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్, క్రీడలు వంటి సదుపాయాలు అందిస్తున్నట్లు తెలియజేశారు.
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు వై.వి. రమణ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుందూరు రాజు, ఉపాధ్యాయినులు అమరావతి, పి. గౌరిదేవి, సూర్యకళ, కుమారి, భవాని, తులసి తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter