డైట్ కళాశాలలో 135వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
14/April/2026 16:20
Share:
దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ అటానమస్, కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, మహానేత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ వైకుంఠ రావు గారు ముందుగా డా. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ, “డా. బి.ఆర్. అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం మరియు విద్య యొక్క ప్రాముఖ్యతను దేశానికి తెలియజేశారు. విద్యార్థులు ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలి” అని అన్నారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఏ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, “అంబేద్కర్ గారి ఆశయాలు యువతలో చైతన్యం కలిగించే విధంగా ఉండాలి. సమాజ సేవలో భాగస్వాములు కావడం ద్వారా విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలి” అని తెలిపారు. తదుపరి మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న విద్యార్థులు అంబేద్కర్ గారి జీవితం, ఆయన చేసిన సేవల గురించి ప్రసంగాలు చేసి, సామాజిక సమానత్వం గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్థులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం పై వ్యాసరచన పోటీలు మరియు క్విజ్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి వి ఫణి బాబు గారు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.