పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.. తల్లిదండ్రులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు.
13/April/2026 07:15
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, .. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ ఏలూరు రామచంద్రరావు పేట లోని వెంకట్రావుపేట స్పెషల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దీనికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి చిన్నారులతో ముచ్చటించారు. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం తో పాటు రైమ్స్ కూడా వినిపించడంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పిల్లలకు ఈ పాఠశాలలో అడ్మిషన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసిందని చెప్పారు. ఎంతో ప్రావీణ్యం కలిగిన టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన చేస్తున్నారని, అంతేకాకుండా చిన్నతనం నుండి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. అంతేకాకుండా వెంకట్రావుపేట స్కూల్లో మధ్యాహ్న భోజనంలో స్కూలు ఆవరణలో పెంచిన ఆర్గానిక్ కాయగూరలను విద్యార్థులకు వండి పెట్టడం పట్ల ఆయన ఉపాధ్యాయులను, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. రాజేశ్వరి, ఉపాధ్యాయులు బాలాజీ, తారక్ తెలుగుదేశం పార్టీ నాయకులు పలివెల లవ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.