అఖిలభారత అంతర విశ్వవిద్యాలయాల కరాటే పోటీలకు డైట్ కాలేజీ విద్యార్థి
06/March/2026 16:45
Share:
అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ అటానమస్ కళాశాల బీ.టెక్ . విద్యార్థి.ఎం.ప్రణీత్ ఫస్ట్ సి. ఎస్. ఈ. బ్రాంచ్ ఇటీవల జేఎన్టీయూ జీవి విశ్వవిద్యాలయ అంతర కళాశాల కరాటే పోటీలలో సెలెక్ట్ అయినారు. మార్చి 17,18 తేదీలలో “సాగి యూనివర్సిటీ” , భోపాల్ ,మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగు అఖిలభారత అంతర్ విశ్వవిద్యాలయ కరాటే పోటీలలో పాల్గొన్నట్టు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బి. సి.హెచ్ శ్రీనివాసరావు తెలిపారు .పై పోటీలకు తమ కళాశాల విద్యార్థి ఎంపిక కావడం పట్ల కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ గారు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావుగారు మరియు కళాశాల అధ్యాపక ఆధ్యాపకేతర సిబ్బంది హర్షం తెలిపారు .