అనకాపల్లి దాడి వీరు నాయుడు డిగ్రీ కళాశాలలో కళాశాల చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ గారు రూరల్ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని ఉద్దేశంతో రిషి నాలెడ్జ్ హబ్ ఫౌండేషన్ వారి సహకారంతో మెగా జాబ్ డ్రైవ్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కోరిబిల్లి రమేష్ మాట్లాడుతూ ఈ జాబ్ డ్రైవ్ లో సుమారు 30 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అనకాపల్లి రూరల్ ప్రాంతాల నుండి వచ్చిన 400కు పైగా అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ఈ మౌఖిక పరీక్షల్లో 110 మంది అభ్యర్ధులు ఉద్యోగాలను పొందడం జరిగిందని, వారికి కంపనీల ప్రతినిధులు నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. వీరు ఈ జాబ్ డ్రై లో పాల్గొన్న ఫ్లిప్కార్ట్, హెట్రో డ్రగ్స్, డెక్కన్ కెమికల్స్, పేటీఎం, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, మైత్రి ఇన్ఫ్రా, జంగ్ గ్రామ్, ఎల్జి వంటి సుమారు 27 ప్రముఖ కంపెనీలకు ఎంపిక అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కంపెనీల హెచ్ఆర్ లు రిషి టెక్నాలజీ హబ్ హెచ్ ఆర్ మేనేజర్ పి నవీన్ ప్లేస్మెంట్ పార్క్ నుండి జి అభిలాష్, ఫ్యూజన్ నుండి మణికంఠ, జిన్ గ్రం ఐటీ సొల్యూషన్స్ నుండి జగన్ కుమార్ తదితరులు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎస్ దయా మాదిరి, అధ్యాపకులు ఎస్ఆర్ జమీర్, యు నాగేశ్వరరావు, ఎస్ మేరీ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు