డైట్ లో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు..

డైట్ లో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు..

13/November/2026 15:52    Share:   

అనకాపల్లి | దాడి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ - అటానమస్ లో “జాతీయ విద్యా దినోత్సవాన్ని”   కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ (NSS) యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా   దాడి విద్యాసంస్థల చైర్మన్  దాడి రత్నాకర్ గారు  విచ్చేసి  మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా రత్నాకర్ గారు  విద్యార్థులను ఉద్దేశించి  మాట్లాడుతూ  మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, దేశంలో విద్యావ్యవస్థ పటిష్టతకు పునాదులు వేశారని వివరించారుప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠ రావు గారు మాట్లాడుతూ   దేశ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేశారు. విద్య ద్వారానే సామాజిక సమానత్వం, జాతీయ సమైక్యత, శాస్త్రీయ దృక్పథం పెంపొందుతాయని తెలిపారు. భారత ఆధునిక విద్యావ్యవస్థకు రూపశిల్పిగా అభివర్ణిస్తూ, సార్వత్రిక విద్య, మహిళా విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్య అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి, సమాజ అభివృద్ధికి, దేశ నిర్మాణానికి ప్రధాన సాధనమని ఆయన భావించారని వివరించారు.    
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు,  అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఏ కిరణ్ కుమార్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు  పాల్గొని జాతీయ విద్యా దినోత్సవ  ప్రతిజ్ఞ చేశారు.
Breaking News

Subscribe our Newsletter