అనకాపల్లి పట్టణ పరిధిలోని తుంపాల సంత వద్ద ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని ప్రజలకు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు వివరించారు. ప్రజలకు ముఖ్యంగా క్రింది అంశాలపై అవగాహన కల్పించబడింది: OTP (One Time Password) ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోరాదని సూచించబడింది. బ్యాంకు అధికారులు లేదా ఇతర సంస్థలు OTP అడగరని వివరించారు. APK files లేదా తెలియని links ద్వారా వచ్చే apps ను download చేయకూడదని, ఇవి మొబైల్ డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని. Online betting apps వలన ఆర్థిక నష్టం మరియు చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని ప్రజలకు వివరించారు.. తెలియని వ్యక్తుల నుండి వచ్చే video calls ను attend చేయకూడదని, ముఖ్యంగా అవి blackmail లేదా cyber fraud కు దారితీయవచ్చని వివరించారు.. Social media ద్వారా వచ్చే fake offers, lottery messages, loan apps మరియు investment scams పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తుంపాల సంతకు వచ్చిన వ్యాపారులు మరియు ప్రజలు పాల్గొని, సైబర్ నేరాల పట్ల అవగాహన. ప్రజలు తమ వ్యక్తిగత మరియు బ్యాంకు వివరాలను రహస్యంగా ఉంచుకుని, సైబర్ నేరాల నుండి తమను తాము రక్షించుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.