కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటమే మార్గం: ఏఐటీయూసీ..!!జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె అచ్చుతరావు

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటమే మార్గం: ఏఐటీయూసీ..!!జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె అచ్చుతరావు

01/May/2026 13:45    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - యలమంచిలి : 

మేడే సందర్భంగా దేశ కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని కాపాడుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దీర్ఘకాల ఉద్యమాలు నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె అచ్చుతరావు పిలుపునిచ్చారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, సుమారు 140 సంవత్సరాల క్రితం ప్రపంచ కార్మిక వర్గం ఐక్య పోరాట ఫలితంగా రోజుకు 8 గంటల పనిదినం సాధించుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరిచే విధంగా చర్యలు తీసుకుంటోందని విమర్శించారు.29 కార్మిక చట్టాలను రద్దు చేసి, పారిశ్రామిక వేత్తలు మరియు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చారని, దీని వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. అలాగే 8 గంటల పనిదినాన్ని 12-14 గంటలకు పెంచేలా చట్టాలు తీసుకురావడం కార్మికులపై అదనపు భారం మోపే చర్యగా అభివర్ణించారు.కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు, 4 లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
Breaking News

Subscribe our Newsletter