ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే కళా వెంకట్రావు..

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే కళా వెంకట్రావు..

18/September/2026 20:34    Share:   

చీపురుపల్లి, సెప్టెంబర్ 18:

ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ప్రజాదర్బార్‌ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. శుక్రవారం చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై 30కి పైగా వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు.
ప్రతి వినతిని పరిశీలించిన ఎమ్మెల్యే సమస్యల వివరాలను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులతో మాట్లాడారు. నిబంధనల మేరకు ప్రజా సమస్యలను సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులను ప్రజలు నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, రౌతు కామనాయుడు, గవిడి నాగరాజు, దన్నాన రామచంద్రుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాగాన రామారావు, బలగం వెంకట్రావు, కోట్ల మోతీలాల్ నాయుడు, బాలి బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

క్రైమ్ అనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు
Breaking News

Subscribe our Newsletter