పోలవరం ఎడమ కాలువ నీటిపై ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలు..

పోలవరం ఎడమ కాలువ నీటిపై ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలు..

04/September/2026 06:58    Share:   

అనకాపల్లి, 
అనకాపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపు అంశంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై విమర్శలు చేశారు. అనకాపల్లి పర్యటనను కూడా ప్రభుత్వం మరో ఈవెంట్‌గా మార్చిందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ కాండ్రేగుల సత్యవతి, నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, ఉత్తరాంధ్ర అభివృద్ధి తదితర అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.పోలవరం ఎడమ కాలువకు నీటి విడుదలను ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడం కాకుండా, ఉత్తరాంధ్రకు శాశ్వతంగా సాగు, తాగునీటి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు.

క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ
Breaking News

Subscribe our Newsletter