అన్నదాన సత్రానికి ఎంవిఆర్ భూరి విరాళం కనకదుర్గ ఆలయానికి 5 లక్షల సహాయం
01/March/2026 07:38
Share:
అనకాపల్లి ప్రముఖ సామాజిక వేత్త ఎంవిఆర్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) తన ఉదాతను మరొకసారి చాటుకున్నారు. మండలంలోని సత్యనారాయణపురం కొండపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆదివారం రాత్రి ఎంవిఆర్ దర్శించు కున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎంవిఆర్ కు ఆశీర్వాదం చేసితీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఎంవిఆర్ స్పందించి ఉన్నఫలంగా అన్నదాన సత్రం నిర్మాణానికి 5 లక్షల 116 రూపాయలు చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ ప్రాంతం ఆత్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు తను వంతు సహకారాన్ని అందిస్తామని ఆలయ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆలయానికి వచ్చిన ఎంవీఆర్ ను ఆలయ అభివృద్ధికి అడిగిన వెంటనే అధిక మొత్తంలో ఆర్థిక సహకారం అందించిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోయిన రమణ ,సత్తిబాబు, ఆలయ ప్రధాన అర్చకులు, ఎం వి ఆర్ యువసేన సభ్యులు గైపూరి రాజు, కడిమిశెట్టి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.