హేమగిరి సత్యనారాయణ స్వామి కొండపై సీడ్ బాల్స్ కార్యక్రమం.
అనకాపల్లి: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, ప్రకృతి వనరుల సంరక్షణ లక్ష్యంగా గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో హేమగిరి సత్యనారాయణ స్వామి కొండపై సీడ్ బాల్స్ (విత్తన బంతులు) కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హేమగిరి సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ అప్పికొండ గణేష్ గారు హాజరై సీడ్ బాల్స్‌ను కొండ పై ప్రాంతంలో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. సీడ్ బాల్స్ ద్వారా కొండ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో సహజసిద్ధంగా మొక్కల పెరుగుదలను ప్రోత్సహించవచ్చని తెలిపారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు పక్షులు, ఇతర జీవరాశులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించవచ్చని" పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ సభ్యులు శ్రీ కాoడ్రేగుల సత్యనారాయణ గారు భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్
మాట్లాడుతూ," పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడమే గ్రీన్ క్లబ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సీడ్ బాల్స్ ద్వారా కొండ ప్రాంతాల్లో సహజ వృక్ష సంపదను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వృక్షమిత్ర మరియు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు శ్రీ కొణతాల పణి భూషణ్ శ్రీధర్
“ఒక సీడ్ బాల్ – ఒక మొక్కకు నాంది; ఒక మొక్క – భవిష్యత్ తరాలకు జీవనాధారం” అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, సీడ్ బాల్స్‌ను విస్తృతంగా ఉపయోగించి ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ మహిళా విభాగం సభ్యులు శ్రీమతి రావూరి అనిత, కర్రీ నీలవేణి గారు, శ్రీమతి భానుమతి గారు, శ్రీ నైశెట్టి సత్తిబాబు గారు, కోన రామ్మోహన్ రావు గారు, శ్రీ పెoటకోట సురేష్ కుమార్ గారు, యల్లపు సంతోష్ కుమార్ గారు మరి గ్రీన్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం అయినది. ఈ సందర్భంగా పలువురు భక్తులు గ్రీన్ క్లబ్ సేవలను ప్రశంసించడం విశేషం. అనంతరం పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసి, పర్యావరణ పరిరక్షణ నినాదాలతో ర్యాలీ చేయడమైనది.