ఫూలే,అంబేద్కర్ విగ్రహాలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి..

ఫూలే,అంబేద్కర్ విగ్రహాలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి..

12/October/2026 21:55    Share:   


రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పోతుల నాగరాజు డిమాండ్

అనకాపల్లి:
జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో విద్య, సామాజిక అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, ఆయన ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో ఐక్యతను పెంపొందించవచ్చన్నారు. ఈ మహనీయుల ఆలోచనలు, ఆశయాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, భావితరాలకు వారి సేవలను పరిచయం చేయడానికి విగ్రహాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఫూలే, అంబేద్కర్ విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, ప్రభుత్వమే విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. నారాయణ నాయక్, నాయకులు ఎం. చిట్టియ్య, వి. శేఖర్, పి. నూకరాజు, పి. శ్రీను తదితరులు పాల్గొన్నారు.

క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్
శ్రీనివాసరావు అప్పికొండ
Breaking News

Subscribe our Newsletter