అంబేద్కర్ గారి విగ్రహాన్ని మార్చవద్దు,పిజిఆర్ఎస్ లో నేతల రమేష్ బాబు ఫిర్యాదు
28/July/2026 20:36
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు. ఏలూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగిన పిజిఆర్ఎస్ లో ఏలూరు పాత బస్టాండ్ దగ్గర గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని అచట నుండి తొలగించవద్దని వేరే ప్రాంతానికి మార్చవద్దని అంబేద్కర్ గారి విగ్రహం ప్రస్తుతం ఉన్నచోటనే కొనసాగించాలని 1944 లో అంబేద్కర్ గారు ఏలూరు లో పర్యటించినప్పుడు సీఎస్ఐ స్కూల్ అలెగ్జాండర్ హాలు వద్దనుండి మున్సిపల్ ఆఫీసు వరకు అదే రోడ్లో ఊరేగింపు గా వెళ్ళినందున దానికి గుర్తుగా సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ 1996 లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిప్రష్టించారని అంతటి చరిత్ర ఉన్న ఆస్థలం నుండి అంబేద్కర్ గారి విగ్రహాన్ని వేరే స్థలంలోకి మార్చ వద్దని కోరుతూస్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి గారికి సీనియర్ దళిత బహుజన నాయకుడు నేతల రమేష్ బాబు దాసి వెంకటేశ్వర్లు కర్రే అంబేద్కర్ బుస్సా తిరుమల రావు తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు