అంతర్గాం 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఆర్‌ఐ అరెస్ట్..!!

అంతర్గాం 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఆర్‌ఐ అరెస్ట్..!!

10/April/2026 07:55    Share:   

అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బహిర్గతం రూ.10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఆర్‌ఐ అరెస్ట్..!!
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, సోషల్ మీడియా ఇంచార్జ్ :
పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)గా పనిచేస్తున్న సెడంక శ్రీమాన్, ఫిర్యాదుదారుని తల్లికి సంబంధించిన భూమిపై “భూ భారతి చట్టం-2025” కింద క్షేత్రస్థాయి విచారణ జరిపి, తహసీల్దార్‌కు అనుకూల నివేదిక సమర్పించేందుకు రూ.10,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.ఫిర్యాదుదారు సమాచారం మేరకు రంగంలోకి దిగిన తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ ) అధికారులు, అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలోనే ఆర్‌ఐ లంచం స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న అవినీతి మళ్లీ బహిర్గతమైంది. ప్రజల నుంచి సేవల కోసం లంచాలు డిమాండ్ చేయడం తీవ్రమైన తప్పు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.“కక్కుడుకూడుకి అలవాటు పడ్డ మేలిమి వజ్రాలు” అన్నట్లు, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అవినీతికి పాల్పడటం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.ప్రజలు ఇలాంటి లంచాల డిమాండ్లను ధైర్యంగా నిరాకరించి, వెంటనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
Breaking News

Subscribe our Newsletter