కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు,
రానున్న వర్షకాలంలో నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా పటిష్ట ప్రణాళికలతో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహింపచేస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ప్రజలు కూడా డ్రైన్‌లలో చెత్తా చెదారాలు వేయకుండా సంపూర్ణ పారిశుద్ధ్య పరిస్థితుల కల్పనకు తమవంతు సహకారాన్ని స్వచ్ఛందంగా అందించాలని ఆయన సూచించారు. స్వచ్ఛ నియోజకవర్గంగా ఏలూరును తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి అహర్నిశలు పాటుపడుతున్నారు. దీనిలో భాగంగానే రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఆలోచనతోనే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పనులను శరవేగంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఈక్రమంలో గత 20రోజుల నుండి నగరంలోని ప్రధాన డ్రైన్‌లలో పెద్ద మొత్తంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాల తొలగింపు పనులను సిబ్బంది యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక 45వ డివిజన్‌లో జాలిపూడి డ్రైన్‌లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియను, స్థానిక 7వ డివిజన్ తూర్పువీధి గంగానమ్మ గుడి సమీపంలో డ్రైనేజీల్లో షిల్ట్ తొలగింపు పనులను ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్ అధికారులకు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలెవ్వరూ ఇబ్బందులు పడకూదనే ఆలోచనతోనే ముందస్తుగా నగరంలోని ప్రధాన డ్రైన్‌లలో వ్యర్థాల తొలగింపు ప్రక్రియను వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. గత 20రోజుల నుండి ఈ పనులను మరింత ముమ్మరం చేశామని చెప్పారు. దుర్గందభరితంగా, దుర్వాసనాభరితంగా డ్రైన్‌ల చుట్టుపక్కల వాతావరణం మారిపోతోందని, దీనికి ప్రధాన కారణం డ్రైన్‌లలో ఇష్టానుసారంగా వేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారమేనని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమవద్దకు వచ్చే చెత్తసేకరణా సిబ్బందికి తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా అందించాలని, డ్రైన్‌లలో ఎవ్వరూ వ్యర్థాలు వేయకుండా సహకారించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఇంజనీర్ సురేంద్రబాబు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటి మేయర్ కర్రి శ్రీనివాస్, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, కార్పొరేటర్ ఇలియాస్ పాషా, మాజీ కార్పొరేటర్ జుజ్జువరపు ప్రతాప్, క్లస్టర్ ఇంచార్జ్ మారం హనుమంతరావు క్లస్టర్ కో ఇన్ఛార్జ్ బొడ్డేటి మహేష్ డివిజన్ల ఇన్చార్జిలు కంచు గుమ్మం నాని, చౌటుపల్లి శ్రీనివాసరావు, రాజా మురళీకృష్ణ ,పొలమరశెట్టి గోపాలకృష్ణ డివిజన్ కో ఇన్ఛార్జ్ నడుంపల్లి సత్యనారాయణ రాజు టిడిపి నాయకులు మెలిపాక వెంకన్న, జంప సూర్యనారాయణ, మూతికి రాఘవమ్మ ,కాళ్ళ శ్రీదేవి మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు...