రోలుగుంట గంజాయి కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అరెస్ట్

రోలుగుంట గంజాయి కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అరెస్ట్

30/June/2026 21:37    Share:   

అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు పర్యవేక్షణలో రోలుగుంట సబ్ ఇన్‌స్పెక్టర్ పి.రామకృష్ణారావు మరియు వారి బృందం కీలక విజయాన్ని సాధించింది.నాలుగేళ్లుగా పోలీసుల కళ్లకు చిక్కకుండా పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ గంజాయి అక్రమ రవాణాదారుడు కొర్రా ప్రసాద్ @ గబ్బర్ సింగ్ (46) ను రోలుగుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వివరాలు

  • పేరు: కొర్రా ప్రసాద్ @ గబ్బర్ సింగ్

  • తండ్రి పేరు: మల్లేష్

  • తెగ: PTG (గిరిజన తెగ)

  • నివాసం: జి.పెదబయలు గ్రామం, గెమ్మిలి పంచాయతీ, జి.మాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా

  • Crime No.155/2022 (NDPS Act, Section 20(b)(ii)(C))లో ఇతను నాలుగో నిందితుడు (A4).

  • 2022లో కేసు నమోదైనప్పటి నుండి నాలుగేళ్లుగా పరారీలో ఉన్నాడు.

  • నమ్మదగిన సమాచారం ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఈరోజు పోలీసులు అతన్ని పట్టుకున్నారు.జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇంకా పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Breaking News

Subscribe our Newsletter