ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శాకంబరీ దేవిగా నూకాంబిక అమ్మవారి దర్శనం
అనకాపల్లి: ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలనే సంకల్పంతో అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ పరిశీలకులు మళ్ల సురేంద్ర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పి.డి. ప్రసాద్, కాండ్రేగుల దీనబంధు, ఎస్. భానుచందర్ (అఖి), వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలిసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ