(UCG)  కాంప్లెక్స్‌ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్.

(UCG)  కాంప్లెక్స్‌ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్.

02/September/2026 07:56    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు.
చింతలపూడి మండలంలో   సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి  (UCG)  కాంప్లెక్స్‌ ఏర్పాట్లపై ఏలూరు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శి డా. ఎన్ . యువరాజ్ రాష్ట్ర సచివాలయం నుండి ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మరియు సంబంధిత శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి  మాట్లాడుతూ చింతలపూడి మండలంలోని రేచర్ల, శెట్టివారిగూడెం లలో  సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి (UCG) ప్రాజెక్ట్ కాంప్లెక్స్‌ ఏర్పాట్లపై      అవసరమైన భూసేకరణ,మౌళిక వసతులు, విద్యుత్తు, నీటివసతి, రహదారులు, పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలుపై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కార్యదర్శి యువరాజ్ కు తెలియజేసారు. భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి (UCG) ప్రాజెక్ట్ కాంప్లెక్స్‌ ఏర్పాటుపై  తీసుకున్న, తీసుకుంటున్న  చర్యలపై నివేదిక ను సమర్పిస్తానని తెలియజేసారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, జిల్లా పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజర్ బాబ్జి, ప్రభృతులు పాల్గొన్నారు. 
Breaking News

Subscribe our Newsletter