ఏలూరులో ఎమ్మెల్యే  బడేటి ప్రజా దర్బార్: అధికారులతో మాట్లాడి అప్పటికక్కడే సమస్యల పరిష్కారం.

ఏలూరులో ఎమ్మెల్యే  బడేటి ప్రజా దర్బార్: అధికారులతో మాట్లాడి అప్పటికక్కడే సమస్యల పరిష్కారం.

04/April/2026 06:11    Share:   


ఏలూరు, 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఏలూరు,ఇంచార్జి,
ప్రజా సమస్యలు తెలుసుకోవడం ద్వారా వాటి పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమం తోడ్పడుతుందని ఏలూరు ఎమ్మెల్యే  బడేటి చంటి పేర్కొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన్నే నిలుస్తుందని, వారి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఏలూరు పవర్ పేట లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు,  వినతులు  ఎమ్మెల్యే బడేటి చంటి స్వీకరించారు. అధికారులతో మాట్లాడి పలు సమస్యలకు పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజా దర్బార్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమంలో ప్రజా వినతులను  తీసుకోవడం జరుగుతోందన్నారు. ఏలూరులో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నప్పటికీ శుక్రవారం కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల నుండి వినతులు  స్వీకరించడంతోపాటు వారి సాధకబాధకాలను కూడా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి వలన లబ్ధిదారులకు కలుగుతున్న ప్రయోజనాలు వంటి వాటిని ప్రజాదర్బార్లో తెలుసుకుంటున్నామని  చెప్పారు.. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్,  డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాస్, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం, టిడిపి నాయకులు మారం హనుమంతరావు, ఆర్నేపల్లి తిరుపతి, గూడవల్లి వాసు, మల్లెపు రాము, వీరమాచనేని చందు, పిల్లారిశెట్టి సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter