అనకాపల్లిలో జిల్లా స్థాయి "అమరావతి ఛాంపియన్‌షిప్-2026" క్రీడా ఎంపికలు: తేదీలు ఖరారు..

అనకాపల్లిలో జిల్లా స్థాయి "అమరావతి ఛాంపియన్‌షిప్-2026" క్రీడా ఎంపికలు: తేదీలు ఖరారు..

05/August/2026 09:55    Share:   

అనకాపల్లి:
అనకాపల్లి ఏడు నియోజకవర్గాల పరిధిలో "అమరావతి ఛాంపియన్‌షిప్-2026" సెలెక్షన్స్‌లో భాగంగా 17 ఏళ్ల లోపు మరియు 23 ఏళ్ల లోపు (బాలురు & బాలికల) విభాగాలకు సంబంధించి 12 క్రీడాంశాలలో పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు త్వరలో జిల్లా స్థాయి క్రీడలు మరియు ఎంపికలు నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని శ్రీమతి పూజారి శైలజ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా స్థాయి పోటీలు మరియు ఎంపికల వివరాలు:
 * తేదీ 08.08.2026: అనకాపల్లి మండలం ఎన్.టి.ఆర్ స్టేడియంలో బాక్సింగ్, వాలీబాల్, కబడ్డీ, చెస్ మరియు యోగ క్రీడాంశాలలో జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమవుతాయి.
 * తేదీ 08.08.2026: యలమంచిలిలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లో హాకీ క్రీడాంశానికి ఎంపికలు జరుగుతాయి.
 * తేదీ 10.08.2026: జార్జి క్లబ్‌లో బాడ్మింటన్ జిల్లా స్థాయి ఎంపికలు ఉంటాయి.
 * తేదీ 10.08.2026: ఏ.ఎం.ఏ.ఎల్ (AMAL) కాలేజీలో ఖో-ఖో, బాస్కెట్‌బాల్ మరియు అథ్లెటిక్స్ క్రీడాంశాలలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించబడతాయి.
ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని శ్రీమతి పూజారి శైలజ కోరారు.
Breaking News

Subscribe our Newsletter