అనకాపల్లి : కశింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ అల్లు స్వామినాయుడు నమ్మదగిన సమాచారం ఆధారంగా కశింకోట మండలం నూతనగుంటపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.
ఈ దాడిలో కశింకోట ఎస్సై కె. లక్ష్మణరావు మరియు పోలీసు సిబ్బంది పాల్గొని సహకరించారు. నూతనగుంటపాలెం గ్రామానికి చెందిన గొంతిన భూలోక మరియు కాశీందేవి నాగమణి అనే వ్యక్తులు తమ నివాసంలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ, మహిళలను ప్రలోభపెట్టి వ్యభిచారానికి పాల్పడేలా చేస్తున్నట్లు గుర్తించారు.
రక్షణ చర్యలు.. స్వాధీనం..
దాడిలో ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించారు. నేరానికి సంబంధించిన మూడు మొబైల్ ఫోన్లు మరియు ఇతర నేర సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి, కశింకోట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.163/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీఐ హెచ్చరిక
ఈ సందర్భంగా సీఐ అల్లు స్వామినాయుడు గారు మాట్లాడుతూ, మహిళల దోపిడీ, వ్యభిచార గృహాల నిర్వహణ వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.