రబీ సీజన్‌కు అనువైన పంటలు, విత్తన రకాలపై రైతులకు అవగాహన సదస్సు

రబీ సీజన్‌కు అనువైన పంటలు, విత్తన రకాలపై రైతులకు అవగాహన సదస్సు

06/October/2026 07:15    Share:   

ఎలమంచిలి : ఈ రబీ సీజన్‌కు అనువైన పంటలు, విత్తన రకాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీమతి కుమారి గారు, వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ ఎం.బి.జి.ఎస్.కుమారి గారు, వ్యవసాయ పరిశోధన స్థానం, ఎలమంచిలి శాస్త్రవేత్త డాక్టర్ ఏ.బి.ఎం.శిరీష గారు పాల్గొన్నారు.

అలాగే బి.సి.టి.కె.వి.కె శాస్త్రవేత్తలు డాక్టర్ సత్తిబాబు గారు, డాక్టర్ శ్రీ సంధ్య గారు, ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ శైలజ గారు, శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ గారు పాల్గొన్నారు.

వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీమతి సుమంత గారు, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీ మోహన్ రావు గారు, డి.ఆర్.సి వ్యవసాయ శాఖ, అనకాపల్లి అధికారులు, వ్యవసాయాధికారి శ్రీమతి విజేత గారు, వి.ఏ.ఏలు, అభ్యుదయ రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఈ రబీ సీజన్‌కు అనువైన పంటలు, విత్తన రకాల గురించి రైతులకు వివరించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఏ పంటలు వేసుకోవాలో సూచించారు.

అలాగే వరి పంటలో ఎరువుల యాజమాన్యం గురించి, పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు.

Breaking News

Subscribe our Newsletter