మూలజంప జెడ్పీ హై స్కూల్‌లో పుస్తకాల పంపిణీ కార్యక్రమం !

మూలజంప జెడ్పీ హై స్కూల్‌లో పుస్తకాల పంపిణీ కార్యక్రమం !

12/June/2026 20:17    Share:   

రాంబిల్లి మండలం మూలజంప గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. విద్యా శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు విద్యా సంవత్సరం మొదటి రోజే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ సందర్భంగా యూనిట్ ఇన్చార్జ్ అందుకూరి ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అల్లవరపు నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ అచ్చయ్య నాయుడు, హెచ్ఎం బాల ప్రభావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పుస్తకాల పంపిణీ ద్వారా విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించేందుకు అవకాశం కల్పించబడింది.

Breaking News

Subscribe our Newsletter