ఏలూరు శిశుగృహ సిబ్బంది అంకితభావం అభినందనీయం: ఐఏఎస్ సూర్యకుమారి..

ఏలూరు శిశుగృహ సిబ్బంది అంకితభావం అభినందనీయం: ఐఏఎస్ సూర్యకుమారి..

18/June/2026 20:28    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
మహిళాభివృద్ధి మరియు శిశుసంక్షేమ శాఖ వయోవృద్ధులు ట్రాన్స్ జెండరు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి సూర్యకుమారి ఐఏఎస్,గురువారం ఏలూరు జిల్లాలోని వివిధ అంగన్వాడి సెంటర్లను,అదేవిధంగా శిశుగృహాలను సందర్శించటం జరిగినది. శిశుగృహలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న ఏనిమిది మంది చిన్నారులు యొక్క వ్యక్తిగత కేసులు వివరాలను తెలుసుకుని వారిని దత్తత ప్రక్రియలోకి వేగవంతంగా తీసుకు రావాల్సిందిగా తెలియ జేసినారు. అదేవిధంగా శిశు గృహ పరిసరాలను పరిశీలించి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఒక అంకితభావంతో మంచి సమన్వయంతో పనిచేస్తున్నారని కితాబులిచ్చినారు. జిల్లాలో మిల్క్ బ్యాంకు కార్యక్రమాన్ని ప్రమోటు చెయ్యాలని ప్రభుత్వ ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డు దగ్గర అవగాహన కల్పించాలని డిసిపివో సి.హెచ్ సూర్యచక్రవేణికి తెలియజేసినారు.
ఈ సందర్భంగా  రీజనల్ జాయింటు డైరెక్టరు శ్రీమతి బి.సుజాతారాణి, కార్యాలయ సిబ్బంది మౌనిక,  డిసిపివో సి.హెచ్.సూర్యచక్రవేణి, డిసిపియు సిబ్బంది రాజేష్, రాజకుమార్, శిశుగృహ మేనేజరు భార్గవి వారి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter