60 కేజీల గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
కశింకోట,
గంజాయి అక్రమ రవాణాపై కశింకోట పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కశింకోట గ్రామ పరిధిలోని NH-16పై HOP హోటల్ ఎదురుగా నిర్వహించిన వాహన తనిఖీల్లో 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.అనుమానాస్పదంగా వచ్చిన ఒక ఆటోతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు తనిఖీ చేయగా, ఆటో వెనుక భాగంలో రెండు గోనె సంచుల్లో దాచిన 30 ప్యాకెట్లలో మొత్తం 60 కేజీల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.పోలీసులను చూసి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
అరెస్టయిన నిందితులు 1. గాడి రత్నంరాజు, 28 సంవత్సరాలు, కాకినాడ జిల్లా 2. గోబెరు వెంకట చైతన్య, 34 సంవత్సరాలు, రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా
3. గుంత హిమాన్సు శేఖర్ @ జోష్, 22 సంవత్సరాలు, కోరాపుట్ జిల్లా, ఒడిశా 4. కారా కేసరి @ కొర్రా కిశోర్, 32 సంవత్సరాలు, కోరాపుట్ జిల్లా, ఒడిశా మర్రి ఘాషి @ రవి @ చిన్నా, అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.దర్యాప్తులో ప్రధాన నిందితుడు గాడి రత్నంరాజు అరకు ప్రాంతం నుంచి సుమారు 60 కేజీల గంజాయిని కొనుగోలు చేసి రాజమండ్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు, మిగిలిన నిందితులు గంజాయి రవాణాలో ఆటో డ్రైవర్ మరియు పైలట్‌లుగా సహకరించినట్లు వెల్లడైంది.
స్వాధీనం చేసుకున్నవి
- 60 కేజీల గంజాయి
- Bajaj Auto Rickshaw – AP 31 TG 8931
- Bajaj Pulsar NS 200 – AP 40 HD 0752
- YAMAHA FZ-S – AP 07 CB 4775
- POCO C3 Android Mobile – 1
- ITEL A6611L Android Mobile – 1
- REDMI 10A Android Mobile – 1
- NOKIA HMD Keypad Mobile – 1
కశింకోట CI శ్రీ స్వామి నాయుడు గారి పర్యవేక్షణలో, SI K. లక్ష్మణరావు, ASI శ్యామ్ సుందర్, HG D.S. బాబు తదితర సిబ్బంది చురుకుగా పాల్గొని సమన్వయంతో వాహన తనిఖీలు నిర్వహించి గంజాయి అక్రమ రవాణాను భగ్నం చేశారు.విశ్వసనీయ సమాచారాన్ని సేకరించి ముందస్తు ప్రణాళికతో వాహన తనిఖీలు చేపట్టడం, నిందితులు పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి నలుగురిని అదుపులోకి తీసుకోవడం ద్వారా 60 కేజీల గంజాయి రవాణాను కశింకోట పోలీసులు విజయవంతంగా అడ్డుకున్నారు.ఈ కేసులో ASI శ్యామ్ సుందర్ గారు మరియు HG D.S. బాబు గారు చేసిన సమర్థవంతమైన సేవలకు గాను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా నగదు బహుమతి మరియు ప్రశంసాపత్రం (Appreciation Certificate) అందించి అభినందించారు.ఈ కేసులో Cr.No.168/2026 U/s 20(b)(ii)(C) r/w 8(c), Sec.25 NDPS Act, 1985 కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, సరఫరా మార్గాలు మరియు నెట్‌వర్క్‌పై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.