ఆర్థికంగా, రాజకీయంగా బీసీలకు అండగా నిలిచేది టీడీపీయే.
* బీసీల ఎదుగుదల జగన్ రెడ్డికి నచ్చదు, అందుకే కోపం.
* బీసీలకు 34% రిజర్వేషన్లు కేవలం టీడీపీతోనే సాధ్యం.
* బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికే జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు.
చీపురుపల్లి, అక్టోబర్11:
- తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు గారు బీసీలను రాజకీయంగా, సామాజికంగా ముందువరుసలో నిలబెట్టారని, అదే బాటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా పూర్తి అండదండలు అందిస్తున్నారని చీపురుపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు పేర్కొన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం కేవలం తెలుగుదేశం పార్టీ,ఎన్డీయే ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా సాధికారత సాధించడం జగన్ రెడ్డికి అస్సలు నచ్చదని, అందుకే వారిపై తీవ్ర కక్ష పెంచుకున్నారని మండిపడ్డారు. బీసీలకు దక్కాల్సిన 34 శాతం రిజర్వేషన్లను కాలరాసేందుకు, వారి పురోగతిని అడ్డుకునేందుకే జగన్ రెడ్డి ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి బీసీల పొట్టకొట్టారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- ఎస్ ఏ ఎన్ రాజు చీపురుపల్లి రిపోర్టర్