జనసేన పార్టీ రాంబిల్లి ఉద్యమి సభ్యుత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ రాంబిల్లి ఉద్యమి సభ్యుత్వ నమోదు కార్యక్రమం

06/March/2026 20:35    Share:   

యలమంచిలి : జనసేన పార్టీ ఉద్యమి సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాంబిల్లి మండలశాఖ అధ్యక్షుడు పప్పల నూకన్నదొర అన్నారు. శుక్రవారం ఆయన గోవిందపాలెం గ్రామంలో పార్టీ సభ్యుత్వాలను ప్రారంబించారు. మాజీ సర్పంచ్ కిలాడీ అప్పలరాజు కి జనసేన పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూకన్న దొర మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కొత్త సభ్యులను చేర్చడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. భవిష్యత్తులో పార్టీ దరుపున పోలీ చేయాలనుకొనేవారికి కూడా ఈ సభ్యుత్వం తప్పనిసరి అని స్పష్టం చేశారు. పార్టీ కల్పిస్తున్న ఈ సభ్యుత్వం యొక్క ప్రయోజనాలను సభ్యులుగా చేరేవారికి తెలియజేయాలన్నారు. ఈ నెల 10లోపు సభ్యుత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని నూకన్నదొర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కారా నాని, రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter