ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెంచిన ఫీజులు తగ్గించాలి ఎస్‌ఎఫ్‌ఐ
27/June/2026 21:20
Share:
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెంచిన ఫీజులు తగ్గించాలి – పేద విద్యార్థులపై అధిక భారం మోపొద్దు: ఎస్‌ఎఫ్‌ఐ ఎలమంచిలి మండల నాయకులు
ఎలమంచిలి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు విధించిన పెరిగిన ఫీజులను వెంటనే తగ్గించాలని, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం సరైంది కాదని ఎస్‌ఎఫ్‌ఐ ఎలమంచిలి మండల నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకుడు కిరణ్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం విద్యార్థులపై ఫీజుల భారం వేయడం ఆందోళనకరమన్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలను ఆశ్రయిస్తుంటే, ఇలాంటి ఫీజుల పెంపు వల్ల చాలామంది చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.ప్రస్తుతం విధిస్తున్న ఫీజులు:MPC & Bi.P.C – ₹2,650,CEC & HEC – ₹1,562,Vocational – ₹2,952.ఈ ఫీజులను వెంటనే తగ్గించి, పేద విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాజేష్ మహేష్ పాల్గొన్నారు